హెల్మెట్ వైజర్ పై పొగమంచు పడుతుందా? ఈ ట్రిక్ తో ఉచితంగా చెక్ పెట్టండి!
సమర్పించిన వారు: Tech Works Telugu
శీతాకాలంలో లేదా వర్షాకాలంలో బైక్ నడిపేటప్పుడు మన శ్వాస వల్ల హెల్మెట్ వైజర్ లోపల పొగమంచు (Fog) పేరుకుపోతుంది. దీనివల్ల చూపు మందగించి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో నార్మల్ హెల్మెట్ స్క్రీన్‌ని ఆంటీ ఫాగ్ హెల్మెట్ స్క్రీన్ గా మార్చడం ఎలాగో వివరించాము.
కావలసిన వస్తువులు (Zero Cost Solution)
మీరు ఎటువంటి ఖరీదైన స్ప్రేలు కొనక్కర్లేదు. కేవలం వీటితో సరిపోతుంది:
- డిష్ వాష్ లిక్విడ్ (Liquid Soap)
- లేదా షాంపూ (Shampoo)
- లేదా టూత్‌పేస్ట్ (Toothpaste)
స్టెప్-బై-స్టెప్ గైడ్ (Step-by-Step Guide)
- ముందుగా మీ హెల్మెట్ వైజర్‌ను శుభ్రమైన క్లాత్‌తో తూడ్చుకోండి.
- వైజర్ లోపలి భాగంలో కొద్దిగా లిక్విడ్ సోప్ లేదా షాంపూ వేయండి.
- మీ వేలితో వైజర్ మొత్తం ఒక సన్నని పొరలా రుద్దండి.
- ఆ తర్వాత ఒక పొడి మైక్రోఫైబర్ బట్టతో వైజర్ క్లియర్ అయ్యే వరకు మెల్లగా తూడ్చండి (నీళ్లు వాడకండి).
బైక్ రైడర్ల కోసం జాగ్రత్తలు
- లో-విజిబిలిటీ సమయంలో ఎల్లప్పుడూ హెడ్ లైట్ ఆన్ లో ఉంచండి.
- వర్షంలో ప్రయాణించేటప్పుడు టైర్ ప్రెషర్ చెక్ చేసుకోండి.
- వైజర్ పై గీతలు పడకుండా మెత్తటి బట్టలు మాత్రమే వాడండి.
No comments:
Post a Comment