మీ పాత PC లో Windows 11 పని చేస్తుందా? సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోండి!
Published: May 16, 2025 | By: Tech Works Telugu
నేటి కాలంలో లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ Windows 11 వాడాలని అందరికీ ఉంటుంది. అయితే పాత PCలలో 'TPM 2.0' లేదా 'Secure Boot' లేకపోవడం వల్ల ఇన్‌స్టాలేషన్ ఆగిపోతుంది. ఈ గైడ్ ద్వారా ఆ నిబంధనలను బైపాస్ చేసి పాత కంప్యూటర్‌లో విండోస్ 11 ఎలా వేయాలో తెలుసుకోండి.
గమనిక: ఇన్‌స్టాలేషన్ చేసే ముందు మీ డేటా మొత్తం బ్యాకప్ తీసుకోండి. పొరపాటు జరిగితే మీ ఫైల్స్ డిలీట్ అయ్యే అవకాశం ఉంది.
01. Windows 11 ISO డౌన్‌లోడ్:
మైక్రోసాఫ్ట్ అధికారిక వెబ్‌సైట్ నుండి 'Download Windows 11 Disk Image (ISO)' ఆప్షన్ ద్వారా అఫీషియల్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
02. Rufus సాఫ్ట్‌వేర్ వాడకం:
కనీసం 8GB పెన్ డ్రైవ్‌ను కనెక్ట్ చేసి, Rufus ద్వారా ISO ఫైల్‌ను సెలెక్ట్ చేయండి.
03. TPM & Secure Boot Bypass:
Rufusలో 'Start' నొక్కగానే వచ్చే పాప్-అప్‌లో "Remove requirement for 4GB+ RAM, Secure Boot and TPM 2.0" ఆప్షన్‌ను తప్పనిసరిగా టిక్ చేయండి.
04. ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ:
పెన్ డ్రైవ్ సిద్ధమయ్యాక, PC ని రీస్టార్ట్ చేసి బూట్ కీ ద్వారా ఇన్‌స్టాలేషన్ పూర్తి చేయండి.
వీడియో ట్యుటోరియల్ (Step-by-Step Video)
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
Subscribe to Tech Works Telugu
No comments:
Post a Comment